- Advertisement -
తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో భోజనం పెట్టారు ఓ ఫ్యామిలీ. ఒక్క వంటకం తగ్గడంతో తులం బంగారం దక్కించుకున్నాడు అల్లుడు.
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో తన కూతురు సింధుకు, నికిత్ అనే అబ్బాయికి ఇచ్చి 2 నెలల క్రితం పెళ్లి చేశారు గుంత సురేష్, సహన దంపతులు. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పండుగ కావడంతో అల్లుడికి 101 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు అత్తమామలు.
101 రకాల వంటకాలలో ఒక వంటకం తగ్గింది అని నిరూపిస్తే ఏమిస్తారని అత్తమామలను సరదాగా అడిగారు నికిత్. 1 వంటకం తగ్గితే 1 తులం బంగారం ఇస్తామానడంతో, లెక్కేసి చూపించి తులం బంగారం దక్కించుకున్నారు అల్లుడు.
Also Read:‘కాంతార’పై ఆర్జీవీ సంచలనం వ్యాఖ్యలు
- Advertisement -

