బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 10న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాదులతో భేటీ కానున్నారు కేటీఆర్.
మూడు రోజులు కేటీఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉండగా కేటీఆర్‌తో పాటు ఢిల్లీకి మాజీ ఎంపీ వినోద్‌కుమార్, దాసోజు శ్రవణ్ తదితర నేతలు వెళ్లనున్నారు. ఈ కేసులో పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత వేటు వేసేలా సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని కేటీఆర్ ధీమాతో ఉండటమే కాదు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సైతం సూచించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరగా దీనికి కొంత సమయం కావాలని కోరారు ఎమ్మెల్యేలు.
Also Read:TTD:అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు