మునుగోడులో ధనబలానికి, ప్రజాబలానికి మధ్యనే పోటీ:కేటీఆర్‌

116
ktr
- Advertisement -

బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మునుగోడు ఉప ఎన్నిక‌.. అక్ర‌మ కాంట్రాక్టుల‌తో రాజ‌గోపాల్ రెడ్డి సంపాదించిన ధ‌న బ‌లానికి, స్థానిక ప్ర‌జా బ‌లానికి మ‌ధ్య జ‌రుగుతున్న పోటీ అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కాంట్రాక్టుల కోస‌మే మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని రాజ‌గోపాల్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశార‌ని నిప్పులు చెరిగారు.

బీజేపీకి, రాజ‌గోపాల్ రెడ్డికి ఈ ఎన్నిక‌ల్లో బుద్ది చెప్పేందుకు మునుగోడు ఓట‌ర్లు సిద్ధంగా ఉన్నార‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కేవ‌లం రాజ‌గోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం వ‌చ్చిన ఎన్నిక ఇది అని తెలిపారు. కేవ‌లం ఒక వ్య‌క్తి ధ‌న దాహాం వ‌ల‌న వ‌చ్చిన ఎన్నిక అని, ఈ విషయాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకుపోవాల‌ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు మంత్రి కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న కేటీఆర్, ఆయన ఒక అట్టర్ ప్లాఫ్ ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గ సమస్యలను వదిలేసి అసెంబ్లీలో కాంట్రాక్టర్ల బిల్లుల కోసం మాట్లాడిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని కేటీఆర్ విమర్శించారు.

రాజగోపాల్ రెడ్డి ధన దాహంతోనే ఈ ఉప ఎన్నిక మునుగోడు ప్రజల మీద బలవంతంగా రుద్దబడిందన్నారు. బీజేపీ ఇచ్చిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కమిషన్ పైసలతో బైకులు, కార్లుతో పాటు ఇతర విలువైన వస్తువులను ఓటర్లకు రాజగోపాల్ రెడ్డి పంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇంకో సంవత్సరం పాటు పదవీ కాలం ఉన్నా, ఉప ఎన్నిక స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నిక తెచ్చారని, అయితే చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు బీజేపీకి, రాజగోపాల్ రెడ్డికి ఈ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు.

బీజేపీ రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు వ్యవహారాన్ని, ఆయన విఫల‌మైన‌ విధానాన్ని ప్రజలకు వివరిస్తూనే టీఆర్ఎస్ పార్టీ గత ఎనిమిది సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి చేసిన కార్యక్రమాలను వివరించాలని ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.

- Advertisement -