బతుకమ్మ చీరల పంపిణీ రాజకీయం బ్రహ్మాండంగా జరుగుతోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సర్కార్ ఆత్మీయంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతిపక్షాలు నీచ, నికృష్ట రాజకీయాలు చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. పండగ సందర్భంగా మహిళల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
ఇవాళ ఒక్కరోజే 25 లక్షల చీరలను పంపిణీ చేశామని తెలిపిన కేటీఆర్…ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని వారం రోజుల నుంచి ప్రణాళికలు రచించాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు భావదారిద్ర్యంతో ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టిన అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చీరల పంపిణీ సందర్భంగా స్వయంగా మహిళలతో మాట్లాడానని చెప్పిన కేటీఆర్ వారి మాటలు విన్న తర్వాత సంతోషమనిపించిందని చెప్పారు. గత ప్రభుత్వాలకు ఎప్పుడైన పండగ సందర్భంగా కోటి చీరలు పంపిణీ చేయాలనే ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. చీరల పంపిణీపై రాజకీయం చేయడం తగదన్న కేటీఆర్….లోపాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్‌ని తెలిపారు. గతంలో ఎన్నడూ అధికారికంగా బతుకమ్మ పండుగను నిర్వహించలేదన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని…ఇప్పటికైన ప్రతిపక్షాల కుసంస్కారాన్ని విడాలన్నారు.