బోల్తాపడ్డ ఎర్రబెల్లి కాన్వాయ్‌

245
MLA Errabelli Dayakarrao convoy fell into river
MLA Errabelli Dayakarrao convoy fell into river
- Advertisement -

టీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోని కడవెండి నుంచి మాదాపురంలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాలకుర్తి శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో కాన్వాయ్‌ లోని ఒక కారు మరొక కారును ఢీకొట్టడంతో రెండు కార్లు చెరువులో బోల్తాపడ్డాయి.

1505737049.28 ఇందులోని ఒక కారులో జీసీసీ ఛైర్మన్‌ దరావత్‌ మోహన్‌ గాంధీ నాయక్‌ ఉన్నారు. ప్రమాదంతో ఆయన షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. వారిద్దరినీ హుటాహుటీన జనగామ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

 1505737048.27

- Advertisement -