వారేమైనా యుద్ధ వీరులా: కేటీఆర్‌ ఫైర్‌

45
ktr
- Advertisement -

2002లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్‌ బానో సామూహిక లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్‌ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం నాడు విడుదల చేయడం తీవ్ర వివాదాస్పదమైన సంగ‌తి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు.

బానో కేసులో జీవిత ఖైదు అనుభ‌విస్తున్న దోషుల‌ను విడుద‌ల చేయ‌డం మ‌న దేశ మ‌న‌స్సాక్షికి మ‌చ్చ అని కేటీఆర్ పేర్కొన్నారు. రేపిస్టుల‌కు పూల‌మాల‌లు వేసి వారిని యుద్ధ వీరులుగా, స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులుగా ప‌రిగ‌ణిస్తున్నారు. గుర్తుంచుకోండి.. ఇవాళ బిల్కిస్ బానోకు ఏం జ‌రిగిందో.. రేపు మ‌న‌లో ఎవ‌రికైనా జ‌ర‌గొచ్చు అని కేటీఆర్ త‌న ట్వీట్‌ ద్వారా పేర్కొన్నారు.

- Advertisement -