కాలాచష్మాకు నైజీరియన్‌ చిన్నారుల స్టెప్పులు అదుర్స్‌ కేటీఆర్‌ ట్వీట్‌

35
ktr
- Advertisement -

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సామాజిక మాధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమకాలీన అంశాలతో పాటు ప్రజాసమస్యల పైన ఆయన స్పందిస్తుంటారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు తన పోస్టుల ద్వారా సెటైర్ల వేస్తూ చెక్‌పెట్టే కేటీఆర్‌.. అప్పుడప్పుడూ కొన్ని సరద అంశాలనూ షేర్‌ చేస్తూ తన ఫాలోవర్లకు వినోదాన్ని పంచుతుంటారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరలైన ఓ డ్యాన్స్‌ వీడియోకు కేటీఆర్‌ ఫిదా అయ్యారు.

ఈ వీడియో చూస్తే మీ ముఖాల్లో చిరునవ్వు విరబూస్తుంది. ఈ పిల్లలు అద్భుతమైన డ్యాన్సర్లు అని పేర్కొంటూ వీడియోను షేర్‌ చేశారు. బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ స్టెప్పులతో ఉర్రూతలూగించిన కాలా చష్మా విపరీతంగా వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అనేక మంది ఈ సాంగ్‌కు తమదైన శైలిలో డ్యాన్స్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటారు. తాజాగా నైజీరియన్‌ చిన్నారులు కాలాచష్మా సాంగ్‌కు గ్రూప్‌గా ఏర్పడి వేసిన స్టెప్పులకు కేటీఆర్‌ ఫిదా అయ్యారు.

- Advertisement -