మంత్రి ఎర్రబెల్లికి కేటీఆర్ అభినందనలు..

197
Minister Errabelli
- Advertisement -

ఈ- పంచాయతీ నిర్వహణలో మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సత్కరించి అభినందించారు. ప్రగతి భవన్‌లో గురువారం తనను కలిసిన మంత్రి ఎర్రబెల్లితో కేటీఆర్ కాసేపు మాట్లాడారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుండి 12 అవార్డులు వచ్చిన కొద్ది రోజులకే ఈ-పంచాయత్‌ లోనూ తెలంగాణ రాష్ట్రానికి మొదటి అవార్డు వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అనేక అవార్డులు వచ్చే విధంగా పని చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కేటీఆర్ అభినందించారు. పూల మొక్క, శాలువాతో సత్కరించారు.

ఇదే రకమైన పనితీరుతో దేశంలో రాష్ట్రానికి, తమ పదవికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర రావును సత్కరించిన వారిలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూడా ఉన్నారు.కాగా, ఈ అవార్డులు రావ‌డానికి కార‌ణ‌మైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మార్గ‌ద‌ర్శి సీఎం కేసీఆర్‌కి, తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ఎర్రబెల్లి కృతజ్ఞతలు, ధ‌న్య‌వాదాలు తెలిపారు.

- Advertisement -