టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్..

50

ఐపీఎల్ 14 సీజన్‌లో భాగంగా ఈరోజు ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లకు ఇది టోర్నీలో రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. దాంతో నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో రాజస్థాన్ జట్టు బరిలో దిగుతోంది. మరోవైపు చెన్నై వంటి బలమైన జట్టుపై గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ కు సిద్ధమైంది.

తుది జట్లు :

Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Rishabh Pant(w/c), Ajinkya Rahane, Marcus Stoinis, Chris Woakes, Ravichandran Ashwin, Lalit Yadav, Kagiso Rabada, Tom Curran, Avesh Khan

Rajasthan Royals (Playing XI): Manan Vohra, Sanju Samson(w/c), David Miller, Jos Buttler, Shivam Dube, Riyan Parag, Rahul Tewatia, Chris Morris, Chetan Sakariya, Jaydev Unadkat, Mustafizur Rahman