తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా గులాబీ శ్రేణులకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్‌పై అభిమానంతో ఉద్యమ కాలం నుంచి నేటి వరకు టీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులు స్వచ్ఛందంగా పని చేస్తున్నారు. ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా ఉందన్నారు. టీఆర్ఎస్ ఫేస్బుక్ ఖాతాలో 11 లక్షలు, ట్విట్టర్లో 3.6 లక్షల ఫాలోవర్స్ ఉన్నారని కేటీఆర్ తెలిపారు. మనం చెప్పే విషయం ప్రజలకు నేరుగా చెప్పడానికి సోషల్ మీడియా చక్కని వేదికని.. టీఆర్ఎస్ ‘తిరుగులేని రాజకీయ శక్తి’గా మారిందని అని కేటీఆర్ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థుల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. పరుషమైన పదజాలం వాడకుండా.. సమర్థవంతమైన సబ్జెక్ట్‌తో వారిని తిప్పికొట్టాలి. వినూత్నమైన ప్రచారంతో.. ప్రజలకు దగ్గరై.. ప్రత్యర్థులకు టీఆర్ఎస్ దెబ్బ చూపించాలి అని కేటీఆర్ సూచించారు. ఇప్పుడు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో 16 లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. వీళ్లందరిని సోషల్ మీడియాలో యాక్టివ్ చేయాలి. మహిళలు తమ వాకిళ్లలో కారు గుర్తు ముగ్గులు వేసుకుంటున్నట్లు.. పతంగులపై కేసీఆర్ బొమ్మలు ఉండేలా చూడాలని కేటీఆర్ సూచించారు.