KTR:ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డోర్స్ క్లోజ్

10
- Advertisement -

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీలో డోర్స్ క్లోజ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీని వదిలి వెళ్లిన వారికి తిరిగి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని, వారి స్థానాల్లో కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన చిట్‌చాట్ కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

గ్రౌండ్ లెవెల్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ బలమైన పట్టు ఉందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని అన్నారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 40 శాతం ఫలితాలు వచ్చాయని, ఇది పార్టీ బలాన్ని స్పష్టంగా చూపిస్తోందని పేర్కొన్నారు.

ఈ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో భయం మొదలైందని, అందుకే మున్సిపల్ ఎన్నికలను కావాలని ఆలస్యం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల మద్దతు తగ్గిపోతుందనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెనుకాడుతోందన్నారు.

అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితిపై కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని స్థితికి చేరుకున్నారని విమర్శించారు. రాజకీయ లాభాల కోసం పార్టీలు మారిన వారిని ప్రజలు ఎప్పటికీ నమ్మరని, చివరికి వారు రాజకీయంగా ఒంటరులవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Also Read:శాంతి చర్చలు విఫలమైతే సైనిక మార్గమే!

- Advertisement -