ఇక రేవంత్ రెడ్డి తిరిగి ఎన్నికయ్యేది కల అని కేటీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే 78 సీట్లు వస్తాయని చెప్పింది ముమ్మాటికి వాస్తవమన్నారు…ముఖ్యమంత్రి తాను సర్వే చేయించుకోలేదు అన్న విషయం నిజమైతే ఆ మేరకు దేవుడిపైన ఒట్టు వేసి చెప్పాలన్నారు. రాముడిపైన ఒట్టు వేసి అబద్ధాలు చెబితే రేవంత్ రెడ్డికి నష్టం జరుగుతుందని కేటీఆర్ హెచ్చరించారు. తన పాలన పట్ల అంత నమ్మకం ఉంటే రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు లేదంటే అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఉప ఎన్నికలకు ఎన్నికలకు పోయే పోవాలని పిస్తున్నారు.
రేవంత్ రెడ్డికి నీళ్లు ఎత్తిపోయడం తెలవదు, కేవలం సంచులలో పైసలు నింపి ఢిల్లీకి కట్టే ఈఎంఐ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొలవది అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమించి, సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్. అలాంటి ఆయన గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం రేవంత్ రెడ్డి స్థాయి కాదు. రేవంత్ రెడ్డికి ఎత్తు ఒక్కటే తక్కువ అనుకుంటే బుర్ర కూడా తక్కువే అని ఇప్పుడు తెలిసింది. రాహుల్ గాంధీ 2014 నుంచి పదుల సంఖ్యలో ఎన్నికలు ఓడిపోయిండు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టేనా అని కేటీఆర్ ప్రశ్నించారు.
నిజంగానే బీఆర్ఎస్ పార్టీని ఆపగలిగే శక్తి ఉంటే వెంటనే రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలో, లేదంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల ఉపఎన్నికలో లేదా మొత్తం శాసనసభను రద్దు చేసే అసెంబ్లీకి ఎన్నికలు పెడితే దమ్ము ఉన్నదా అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి చేసుకున్న సొంత సర్వేలో 78 సీట్లు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మరోసారి కేటీఆర్ అన్నారు. దీంతోపాటు మరో మూడు, నాలుగు సర్వేల్లో కూడా బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెప్పిన విషయాన్ని కేటీఆర్ మరోసారి ప్రస్తావించారు. ఈ సర్వేల పైన నమ్మకం లేకుంటే రేవంత్ రెడ్డి తాను నిజంగానే సర్వే చేయించలేదనే విషయం పైన దేవుడి పైన ప్రమాణం చేసి చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు. నిజంగానే రేవంత్ రెడ్డికి తిరిగి అధికారంలోకి వస్తానన్న ధైర్యం ఉంటే వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి మళ్లీ ఎన్నికవ్వడం కలనే అన్నారు.
లక్షల క్యూసెక్కుల నీరు కిందికి పారుతుంటే తెలంగాణని కరువు కాటకాల ముందు నిలబెట్టే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాలేశ్వరంలో మేడిగడ్డతో సంబంధం లేకుండా మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం రైతన్నలకు ప్రజలకు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి మూర్ఖత్వంతో తెలివితక్కువతనంతో గత ప్రభుత్వం పైన ద్వేషంతో పంటలను ప్రజలను ఎండబెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని అక్కడ పారుతున్న నదిని ప్రజలకు చూపించడంతోనే తన బండారం బయటపడడంతో రేవంత్ రెడ్డికి పిచ్చి లేసిందని దీంతో అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. ఒకవైపు ప్రజలు రిటైర్డ్ ఇంజనీర్లు పార్టీలు నీటిని ఎత్తిపోసి రానున్న కరువును ఆపాలని డిమాండ్ చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ నీళ్లను తన గురువు కోసం కిందికి వదిలిపెడుతున్నారని విమర్శించారు భద్రాద్రి రాముడు తో భద్రాచలంతో ఎలాంటి కాలేశ్వరం నీటిని వరద పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఇస్తున్నారన్నారు.
ఈరోజు రాష్టంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. వర్షపాత లోపం భారీగా ఉంది. రానున్న రోజుల్లో వర్షం కూడా పడకపోవచ్చు అని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావం ఉంది.ఇలాంటి సందర్భంలో గోదావరి బేసిన్ లో ఉన్న రిజర్వాయర్ల స్టోరేజీ కూడా సగానికి పైగా ఖాళీగా ఉంది. మరోవైపు కన్నెపల్లి దగ్గర లక్షల క్యూసెక్కుల నీరు కిందికి పారుతుంది. రానున్న అక్టోబర్ వరకు కూడా ఈ లక్షల క్యూసెక్కుల నీరు కిందికి వృధాగా పోయే ప్రమాదం ఉన్నది.కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగానే రైతుల పట్ల, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ నీటిని రానున్న 100 రోజుల పాటు కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ప్రారంభించి ఎత్తిపోస్తే గోదావరి బేసిన్ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఇదే మాటను తాజాగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు స్పష్టంగా ముఖ్యమంత్రికి వివరిస్తూ ఒక లేఖ రాశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మా పైన కోపం ఉండవచ్చు లేదా ద్వేషం ఉండవచ్చు. కానీ తెలంగాణ ప్రజల పైన, రైతన్నల పైన అక్కసు పెట్టుకోకుండా కిందికి పారుతున్న నీటిని ఎత్తిపోస్తే అందరికీ మంచి జరుగుతుంది.రేవంత్ రెడ్డి మాత్రం మేడిగడ్డ బ్యారేజీ పేరు చెప్పి అది కూలిపోతుంది అని ప్రజలను మభ్యపెడుతూ, ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేస్తూ కిందికి నీళ్లను పంపిస్తుంటే.. పక్క రాష్ట్రం వాళ్ళు మాత్రం పట్టిసీమ పంప్ హౌస్ ద్వారా, పంపుల ద్వారా భారీగా నీటిని తోడుకుంటున్నారు.మేడిగడ్డతో ఎలాంటి సంబంధం లేకుండానే, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఒక్క గేటు కూడా మూయకుండానే, కన్నెపల్లి నదీ ప్రవాహం దగ్గర 93 మీటర్ల ప్రవాహం నమోదైన ప్రతిసారి భారీగా నీళ్లను ఎత్తిపోసుకోవచ్చు. ప్రతిరోజు ఒక హుస్సేన్ సాగర్ లో ఉన్న స్థాయిలో ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నది.
కానీ ఈరోజు దాదాపు 97 మీటర్ల నదీ ప్రవాహం కన్నెపల్లి దగ్గర పారుతున్నది. దీన్ని కేవలం ఒక్క బటన్ ద్వారా పంపులు ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తే తెలంగాణ కరువు నుంచి దూరం అవుతుంది. ರಾనున్న 100 రోజుల పాటు కనీసం 200 టీఎంసీల నీటిని గోదావరి బేసిన్ లో ఉన్న రిజర్వాయర్లు, ప్రాజెక్టులకు నింపవచ్చు. మిడ్ మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి, మల్కపేట, బస్వపూర్ రిజర్వాయర్లు అన్నీ నిండుతాయి. దీంతో సగం తెలంగాణకి వ్యవసాయ సంక్షోభం, తాగునీటి సంక్షోభం రాకుండా చూసుకోవచ్చు.
కానీ ముఖ్యమంత్రి కేవలం మతిలేని మాటలు మాట్లాడుతూ తెలంగాణను కరువు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మేడిగడ్డకు, కన్నెపల్లికి లింకు పెట్టి బోడి గుండుకు మోకాలికీ ముడి వేసినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికే అన్నారం, సుందిళ్ల విషయంలో కూడా గ్రౌటింగ్ పూర్తయింది. అక్కడ సురక్షితంగా నీటిని నిల్వ చేసి వాడుకోవచ్చు అని ప్రభుత్వంలోని ఇంజనీర్లే స్పష్టం చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు.
మొన్న మేము కన్నెపల్లి వెళ్లి అక్కడ పారుతున్న లక్షల క్యూసెక్కుల నీటిని ప్రజలందరికీ చూపించాం. దీంతో ముఖ్యమంత్రి బండారం బయటపడింది. అందుకే అడ్డగోలుగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మేడిగడ్డ గేట్లు మూసి నీళ్లు ఎత్తాలని ఏనాడు మేము చెప్పలేదు. కన్నెపల్లి ద్వారానే భారీగా నీళ్లు ఎత్తిపోసుకోవచ్చని చెప్పిన విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి అచ్చోసిన ఆంబోతులా నోటికి వచ్చినట్లు రంకెలు వేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మాటల్లో పిచ్చి వాగుడు, వట్లు, తిట్లు తప్పించి ఇంకేమీ లేదు. తెలంగాణ ముంగిట నిలబడ్డది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
మేడిగడ్డ గురించి, తెలంగాణ ప్రాజెక్టుల గురించి దారుణంగా మాట్లాడుతున్న దరిద్రపుగొట్టు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులు కొట్టుకుపోతాయంటూ సొంత ముఖ్యమంత్రి తన రాష్ట్ర ప్రాజెక్టుల గురించి దరిద్రంగా మాట్లాడుతున్నారు. కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రాజెక్టులను, నీళ్లు ఎలా నింపుకోవచ్చో ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డకు సంబంధమే లేని, ఎక్కడో సుదూరాన ఉన్న భద్రాచలం రాముడితో పాటు 44 ఊర్లు నిండిపోతాయని, మునిగిపోతాయని అబద్ధాలు చెప్తున్నాడు. ఇదే మేడిగడ్డ గత 500 సంవత్సరాలలో ఎప్పుడూ రానంత భారీగా 28.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా కొట్టుకుపోకుండా గట్టిగా నిలబడింది. అలాంటిది లక్ష క్యూసెక్కుల నీటిని తట్టుకోదు అని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు.
తెలంగాణ ప్రజలు, రిటైర్డ్ ఇంజనీర్లు, మా పార్టీ నేతలు, అనేక ఇతర పార్టీల నాయకులు కిందికి నీళ్లు వృథాగా పోతున్నాయి, పైకి ఎత్తిపోసి తెలంగాణ రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తే… రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మరోసారి గత ప్రభుత్వం పైన, కాళేశ్వరం పైన బురద జల్లడానికి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. 2022 నాటి వరద ఫోటోలు చూపించి కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిందని అబద్ధాలు చెప్తున్నారు.
ఒకవైపు నీళ్లు లేక ప్రజలు, రైతన్నలు ఏడుస్తుంటే… రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందంతో నీళ్లు కిందికి పారుతున్నా, ఎత్తిపోయకుండా చూస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు కన్నెపల్లి దగ్గర నీళ్లు లేకుంటే, మరి కిందికి పోతున్న ఆ నీటితోనే పక్క రాష్ట్రంలోని పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎలా పనిచేస్తుంది? వందల టీఎంసీలను ఎలా ఎత్తిపోస్తుందో రేవంత్ రెడ్డి చెప్పాలే. కేవలం తన తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే తన గురువుకి కోపం వస్తుందనే రేవంత్ రెడ్డి లేనిపోని అబద్ధాలు చెబుతున్నారు. భద్రాచలానికి ప్రమాదం ఉంది అంటే అది ముమ్మాటికి పక్క రాష్ట్రం కడుతున్న పోలవరంతోనే కానీ, కాళేశ్వరంతో కాదు. అయినా పోలవరం గురించి గట్టిగా మాట్లాడితే తన గురువుకి కోపం వచ్చి ఇబ్బంది అయితదని రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు. అయినా రాములవారి సాక్షిగా అబద్ధాలు చెబుతూ, ఇప్పటికే అనేక దేవుళ్లను మోసం చేసిన రేవంత్ రెడ్డి అదే ధోరణి కొనసాగిస్తున్నారు.
బుర్ర తక్కువోడు, లుచ్చా రాజకీయం అంటూ మాట్లాడిన రేవంత్ రెడ్డికి అదే స్థాయిలో కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర రైతాంగం కింద పారుతున్న నీటిని ఎత్తిపోయాలని కోరుతుంటే, కిందికి వదిలేస్తున్నోడు బుర్ర తక్కువ వాడు కాదా అని ప్రశ్నించారు. కన్నెపల్లి దగ్గర పుష్కలంగా నీరు ఉంటే, రాజకీయ ద్వేషంతో కళ్ళు మూసుకుపోయిన రేవంత్ రెడ్డి బుర్ర తక్కువోడు అన్నారు. వందల టీఎంసీల నీరు కిందికి పోతుంటే తెలంగాణ రైతాంగం పైన పగబట్టిన, ఎత్తిపోయకుండా తెలంగాణ రైతాంగం పైన పగబట్టిన రేవంత్ రెడ్డి ముమ్మాటికి బుర్ర తక్కువోడు అన్నారు. కనీసం దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో కూడా తెలవని బుర్ర లేని వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజలు, రిటైర్డ్ ఇంజనీర్లు, పార్టీలు ఎంత చెప్పినా పారుతున్న గోదావరి నుంచి నీళ్లు ఎత్తిపోయని రైతు వ్యతిరేకి, బుర్ర లేని వ్యక్తి ముఖ్యమంత్రి అన్నారు. పక్క రాష్ట్రం వాళ్ళు పంప్ హౌస్‌లు ప్రారంభించుకొని నీళ్లు ఎత్తిపోసుకుంటే, కన్నెపల్లి పంప్ హౌస్‌కి తాళం వేసిన దరిద్రుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం మాత్రమే కాకుండా దేవాదుల పంపులు కూడా ప్రారంభించకుండా వరంగల్ జిల్లా రైతుల నోట్లో మట్టి కొడుతున్న రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం గత ప్రభుత్వం పైన కోపంతో రాష్ట్ర రైతాంగం యొక్క పంటల్ని ఎండబెట్టే పనిలో ఉన్నారు. నాలుగు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి, రైతు బీమా కట్టకుండా, పంట గింజలు కొనకుండా రైతులను తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ముమ్మాటికి రైతు వ్యతిరేకే అన్నారు.
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పంప్ హౌస్‌లు ప్రారంభించి, నీళ్లను ఎత్తిపోయకుంటే రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు తిరగబడతారు అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకి సాగునీటి రంగంలో చేస్తున్న ద్రోహానికి చరిత్రహీనుడుగా, రైతు ద్రోహిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలిపోతుంది అన్నారు.వర్షాలు పడకున్నా గోదావరిలో నది నీళ్లు కిందికి పారుతున్నా పట్టించుకోకుండా కావాలనే రైతాంగంపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని ఇంకో రెండు, మూడు వారాలు చూసి పార్టీగా ఒక భారీ కార్యాచరణ ప్రకటిస్తాం అని కేటీఆర్ తెలిపారు.
హరీష్ రావు గారి గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన క్రమశిక్షణ కలిగిన సైనికుడని, పార్టీ ప్రారంభం నుంచి ఆయనకి అండగా నిలబడ్డ నాయకుడు అన్నారు. ఆయన పైన ఇలాంటి చిల్లర పుకార్లు ఎన్నో సార్లు వచ్చాయని వాటికి ఆయన స్పష్టంగా పలుమార్లు సమాధానం ఇచ్చారు అన్నారు. అయినా రేవంత్ రెడ్డి లాంటి పార్టీలు మారే వ్యక్తి ఇతరుల గురించి మాట్లాడడం… సిగ్గుచేటు అన్నారు. పొద్దున లేస్తే కాంగ్రెస్ తో, అర్ధరాత్రి అయిన తర్వాత బీజేపీతో కలిసి ఉండే రేవంత్ రెడ్డి ఇతరుల గురించి మాట్లాడడం ఆపాలన్నారు. అర్ధరాత్రి కాగానే తనపై కేసుల భయంతో బీజేపీ కాళ్ళు పట్టుకునే రేవంత్ రెడ్డి ఇతర పార్టీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు.
Also Read:NPPA:ఈ మెడిసిన్స్ ఇక చౌకే!

