ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ బర్త్‌డే విషెస్‌..

123
ktr

హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, దేవరకద్ర ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి ల పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మంత్రి కేటీఆర్ ఇరువురి ఎమ్మెల్యేల‌కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ… ఇరువురు ఎమ్మెల్యేలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మొక్క‌లు నాటాల్సిందిగా కోరారు.