బాబ్రీ మసీదు కూల్చివేత..సంచలన తీర్పు

311
babri masjid
- Advertisement -

బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత బాబ్రీ తీర్పు వెలువడగా ఈ ఘటన ముందుస్తు పథకం ప్రకారం జరిగింది కాదని పథకం ప్రకారం కూల్చివేసినట్టుగా ఆధారాలు లేవని సీబీఐ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ తుది తీర్పు వెలువరించారు.

ఈ కేసులో 2 వేల పేజీల జడ్జిమెంట్‌ కాపీని రూపొందించగా ఈ కేసులో బీజేపీ నాయకులు, విశ్వహిందూ పరిషత్‌ సభ్యులకు భారీ ఊరట లభించింది. తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేసు తీవ్ర‌త దృష్ట్యా జ‌స్టిస్ సురేంద్ర‌కుమార్ యాద‌వ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం పారామిల‌ట‌రీ భ‌ద్ర‌తను ఏర్పాటుచేసింది. నేటితో ఆయ‌న ప‌ద‌వీ కాలం ముగియ‌డం విశేషం.

1992 డిసెంబర్‌ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేసిన విషయం విదితమే. ఈ కేసును విచారించిన సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -