లెక్కల మాస్టారు ‘చుక్కా’కు కేటీఆర్ విషెస్

3
BRS Working President
- Advertisement -

ప్రముఖ విద్యావేత్త, లెక్కల మాస్టారుగా పేరొందిన చుక్కా రామయ్య 101వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య విద్యార్థులను సానబట్టి మేలిమి వజ్రాల్లా తీర్చిదిద్ది, ఎంతోమంది విద్యార్థుల ఐఐటీ కలలను సాకారం చేసిన గొప్ప వ్యక్తి చుక్కా రామయ్య అని కొనియాడారు.

ఈ సందర్భంగా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. చుక్కా రామయ్యను మనందరం గర్వించే లెక్కల మాస్టారుగా అభివర్ణించారు. ఐఐటీనే ఇంటి పేరుగా చేసుకుని ఆయన సాగించిన శత వసంతాల ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

విద్యారంగంలో చుక్కా రామయ్య చేసిన సేవలు, ఆయన తీర్చిదిద్దిన విద్యార్థుల భవిష్యత్తు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కేటీఆర్ తన సందేశంలో వివరించారు. చరిత్రపై చెరగని ముద్ర వేసిన చుక్కా రామయ్య చల్లగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Also Read:EPFO New Rules:ఈపీఎఫ్‌ విత్‌డ్రా..కొత్త రూల్స్

సామాన్య కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, ఐఐటీలో ప్రవేశం పొందాలనే ఎందరో యువత కలలకు బాటలు వేసిన చుక్కా రామయ్యకు 101వ జన్మదినం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -