రేవంత్‌ను చరిత్ర క్షమించదు:కోమటిరెడ్డి!

2
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన ‘తనను ఎర్రి కుక్క కరిచింది’ అనే వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా పాలకుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ, దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నటికీ క్షమించవని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదని…. ప్రజలే అంతిమ నిర్ణేతలని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.

Also Read:EPFO New Rules:ఈపీఎఫ్‌ విత్‌డ్రా..కొత్త రూల్స్

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వ విధానాలు, పాలనా వ్యవహారాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన.. తాజాగా సీఎం తీరుపై విమర్శలు చేయడం చర్చకు దారితీసింది.

- Advertisement -