ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ ఘాట్ సమీపంలో లవ్ హైదరాబాద్ అక్షరాలతో కూడిన శిల్పాన్ని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామరావు ఆవిష్కరించారు. ముంబైకి చెందిన స్ట్రీట్ ఆర్ట్ ఫౌండేషన్‌తో కలిసి హెచ్‌ఎండీఏ అధ్యర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 1న మొదలైన ఈ కార్యక్రమం ఈ రోజు ముగియనుంది. ముగింపు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌లు పాల్గోన్నారు.
ఈ సంధర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్‌ను ఇంకా సుందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ముంబై, ఢిల్లీ నగరాల్లో చేపట్టిన స్ట్రీట్ ఆర్ట్ కార్యక్రమం హైదరాబాద్‌కు రావడం గొప్ప విషయమన్నారు. ఇందులో బాగం అవుతున్న ఆర్టిస్టులకు, కళాకారులను ఈ సంధర్బంగా కేటీఆర్ అభినందించారు. స్ట్రీట్ ఆర్ట్ ఫౌండేషన్-జీహెచ్‌ఎంసీ కలిసి ట్యాంక్ బండ్‌కు కొత్త రూపు తెచ్చేందుకు కృషి చేస్తున్నాయన్నారు. ఈ టైర్ హోస్ట్ కల్చర్ సెల్ఫీలకు అడ్డాగా మారబోతుందని కేటీఆర్ అన్నారు. ట్యాంక్ బండ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకుంటారన్నారు.