సిద్ధి యోగ ఉత్సవాలకు హాజరైన కేటీఆర్‌..

296
KTR
- Advertisement -

టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నేడు గంభీరావుపేట మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి సిద్ధి యోగ ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ గుడిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు కేటీఆర్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -