2020 పద్మా అవార్డు నామినేషన్ల స్వీకరణ తేదీ ఖరారు..

358
Padma awards 2020
- Advertisement -

తాజాగా 2020 పద్మా అవార్డు నామినేషన్ల స్వీకరణ తేదీలను ప్రకటించిన కేంద్ర హోంశాఖ. నామినేషన్‌లు మే 1 నుంచి సెప్టెంబరు 15 వరకు స్వీకరించబడుతాయని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. దీనికి అర్హులైన వారు పద్మా అవార్డులకు నామినేషన్లను దరఖాస్తూ చేసుకోవచ్చని తెలిపిన కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

పద్మశ్రీ.. భారత ప్రభుత్వం ప్రధానం చేసే పౌర పురస్కారం ఇది. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ మరియు ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే పౌరపురస్కారమే పద్మశ్రీ. పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని కలిగివుంది. అత్యున్నత పురస్కారాలైన వాటిలో మొదటిది భారతరత్న, రెండవది పద్మ విభూషణ్ మూడవది పద్మ భూషణ్ మరియు నాలుగవది పద్మశ్రీ.. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో “పద్మ” “శ్రీ” అని రాసి ఉంటుంది. ఈ పురస్కారాన్ని 1954లో స్థాపించారు.

- Advertisement -