మంత్రి కేటీఆర్​ మరో విజయం…‘స్వచ్ఛ తెలంగాణ’కు బాటలు

258
ktr
- Advertisement -

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ కె.తారక రామారావుగారి విజన్​ మేరకు రాష్ట్రంలోని పురపాలక సంస్థలు ‘స్వచ్ఛ తెలంగాణ‌‌–ఆరోగ్య తెలంగాణ’ దిశగా మరో ముందు అడుగు వేశాయి.దేశంలోని ఇతర ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా తెలంగాణ రాష్ట్రం పారిశుద్ధ్యం(శానిటేషన్)​ విషయంలో మంత్రి కేటీఆర్​ గారు ప్రత్యేక కార్యాచరణతో, నిర్దిష్టమైన గడువులోగా పనులు పూర్తి అయ్యేలా మున్సిపల్​ యంత్రాంగాన్ని సమాయుత్తం చేసి ముందుకు నడిపించారు.

ఫలితంగా రాష్ట్రంలోని 139 మున్సిపాలిటీలు, మున్సిపల్​కార్పొరేషన్ల పరిధిలోని జనాభా దామాషా పద్దతిలో 70 లక్షల పట్టణ జనాభా అవసరాలకు అనుగుణంగా 7,683 మరుగుదొడ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో గత రెండు నెలల కాలంలోనే 4 వేల మరుగుదొడ్ల నిర్మాణపనులు పూర్తి కావడం గమనార్హం.

గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​(జీహెచ్ఎంసీ) పరిధిలోని ఆరు జోన్ల పరిధిలో మంత్రి కేటీఆర్​ అదనంగా 3 వేల మరుగుదొడ్ల నిర్మాణాలను లక్ష్యంగా నిర్దేశించగా, జీహెచ్​ఎంసీ కమిషనర్​ 4,271 మరుగుదొడ్ల నిర్మాణ పనులు లక్ష్యంగా పెట్టకుని నిర్మాణ పనులు పూర్తిచేస్తున్నారు.

మొత్తంగా గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో ఏడు వేల మరుగుదొడ్లు ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రజల వినియోగంలోకి రానున్నాయి.మున్సిపల్​ శాఖ మంత్రి శ్రీ కె.తారక రామారావు గారు ప్రత్యేక శ్రద్దతో మరుగుదొడ్ల నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సంబందిత మున్సిపల్​ కమిషనర్లతో స్వయంగా పర్యవేక్షించడ వల్ల పనులు నిర్ణీత కాలంలో వేగవంతంగా పూర్తి అయ్యాయి.

కొత్త మున్సిపల్​ చట్టాన్ని సమర్ధవంతంగా అమలుచేస్తూ ప్రజానీకానికి మెరుగైన సేవలు కల్పించాలన్న లక్ష్యంతో శానిటేషన్​కు మంత్రి కేటీఆర్​ గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.ఆగస్టు 15వ తేదీ నుంచి ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్ల పరిధిలో 8 వేల మరుగుదొడ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చి దిద్దాలనే ముఖ్యమంత్రి గౌరవనీయులు కె.చంద్రశేఖర్​రావు గారి అడుగుజాడల్లో నడుస్తూ పట్టణాల స్థితిగతుల్లో వినూత్న మార్పులకు మంత్రి కేటీఆర్​ శ్రీకారం చుడుతున్నారు.

- Advertisement -