మరో రెండు రోజులు భారీ వర్షాలు…

146
rains

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఉత్తర బీహార్ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఝార్ఖండ్, గాంగేటిక్ పశ్చిమబెంగాల్ మరియు వాయువ్య బంగాళాఖాతం మీదుగా 3.1 km ఎత్తు వరకు ఏర్పడింది.

ఉత్తర ఆంధ్ర మరియు ఒరిస్సా తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో 4.5 km నుండి 5.8 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.పైన తెలిపిన రెండింటి ప్రభావం వలన వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో రేపు(ఆగస్టు 13 వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.ఈరోజు మరియు రేపు ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.