మొక్కలు నాటిన యువ నటుడు సుమిత్…

195
actor sumith
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు కౌశిక్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటారు యువ నటుడు సుమిత్.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని. మనందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు అవసరమని కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరో ముగ్గురు ( ఆర్టిస్ట్స్ లహరి , స్వప్న , హరి ) లను మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ ను మరో ముగ్గురికి విసరాలని యువ నటుడు సుమిత్ తెలిపారు.

- Advertisement -