దొంగను దొంగలాగే చూస్తారు:రేవంత్‌కు కేటీఆర్ చురక

34
- Advertisement -

నేను ఎక్కడికి పోయినా నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారని రేవంత్ రెడ్డి అంటుండు దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారు అని చురకలు అంటించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా నిన్ను కోసుకొని తినడం కాదు నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావ్ అన్నారు.

రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నావా? సర్కస్ నడుపుతున్నావా?…రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారు అని అన్నాడు.. నిన్న రూ.8,29 లక్షల కోట్లు అని చెపుతున్నాడు అని దుయ్యబట్టారు.

పూటకో లెక్క మాట్లాడుతూ, సంఖ్య పెంచుతున్నాడు.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అసలు అప్పు రూ.4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే… రాష్ట్ర ప్రభుత్వం అసలు, వడ్డీ కలిపి నెలకు చెల్లించే అప్పు కేవలం రూ.2000 కోట్లు మాత్రమే ఇది కాగ్ లెక్క..మీ లాగా కాకి లెక్క కాదు అన్నారు. చెప్పులు ఎత్తుకపోవడానికి వేరే పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు ఢిల్లీకి మూటలు మోయడానికి పోతే దొంగ లెక్కనే చూస్తారు రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్స్, లగ్జరీ ప్రయాణాలు అన్ని ప్రజలు చూస్తున్నారు అన్నారు.

Also Read:INTUC నేతలతో పొన్నం భేటీ

ఫోర్త్ సిటీలో 2000 ఎకరాలు ఎట్లా కొన్నావు రేవంత్ రెడ్డి ? నీ అన్నదమ్ములు, నీ బామ్మర్ది, నీ కుటుంబ సభ్యులు అందరి ఆదాయం పెంచుకున్నావు, కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదు చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి లీటర్ రూ.200 చేసి సంపద పెంచాలని అనుకుంటున్నాడు ధరలు పెంచడం కాదు రేవంత్ రెడ్డి, బుర్ర పెంచు.. సంపద పెంచే ఆలోచన చేయి అన్నారు. దమ్ముంటే 43 సార్లు నీ ఢిల్లీ ప్రయాణాల ఖర్చు మీద శ్వేతపత్రం విడుదల చెయ్ రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -