మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిశారు ఆర్టీసీ INTUC కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహాం తదితర కార్మిక సంఘం నేతలు. ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కి వివరించారు నేతలు.
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సమ్మె ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు పొన్నం.
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సమ్మె ఆలోచనపై విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. ఏ సంఘాలు అయినా తమతో ఆర్టీసీ సమస్యలపై చర్చించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
Also Read:ఉగ్రదాడి..దేశవ్యాప్తంగా సివిల్ మాక్‌డ్రిల్

