సిరిసిల్లలో లక్ష ఎకరాలకు సాగునీరు:కేటీఆర్

212
ktr
- Advertisement -

సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించి తీరుతానని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ రైతలుకు ఎంత సాయం చేసినా తక్కువేనన్నారు. కాంగ్రెస్ ,టీడీపీ ప్రభుత్వాల హయాంలో హరిగోసపడ్డామన్నారు.

రైతులకు ఎంత సాయం చేసినా తక్కువేనన్నారు. రాష్ట్రంలో రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.8వేలు ఇస్తున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చాక రూ.10వేలకు పెంచుతున్నామన్నారు. 2018 వరకు పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేసుకుంటే.. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేలు ఇస్తున్నామని చెప్పారు.

గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా.. రైతుబీమా ద్వారా బాధిత రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామని చెప్పారు. నియోజకవర్గంలో 50వేల టన్నుల నిల్వగల గోదాములను నిర్మించినట్లు వెల్లడించారు. సిరిసిల్ల చుట్టూ రింగ్‌రోడ్డు వేసి తంగళ్లపల్లి రూపురేఖలు మారుస్తానని తెలిపారు కేటీఆర్.

- Advertisement -