KTR:ఫోన్ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం లేదు

28
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… అడ్డగోలుగా మాట్లాడితే ముఖ్యమంత్రిని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ ఎంపీల ఫోన్ ట్యాపింగు చేశారని… ఈరోజు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి పై విమర్శలు చేశారు.

మీ వదిన ఆరోపణలు చేసిన వాటి పైన కూడా రేవంత్ రెడ్డి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అధికారులు మారలేదు ప్రభుత్వమే మారింది… ఆనాడు ఉన్నా శివధర్ రెడ్డి… టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డిలు, రవి గుప్తా లాంటి అధికారులే ఈ రోజు ఉన్నారు..ఈ అధికారులు ఎవరూ కూడా బాధ్యులు కారా?,ఒకవేళ ఫోన్ టాపింగ్ జరిగే ఉంటే…చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి ఫోన్ టాపింగ్ వ్యవహారాల పైన విచారణ చేపట్టాలన్నారు.

ముఖ్యమంత్రి పక్కన ఉన్న పొన్నం ప్రభాకర్ గతంలో చేసిన విమర్శలపైన సమాధానం చెప్పాలన్నారు. గతంలో నా ఫోన్ కూడా సర్వేలెన్స్ లో ఉందని నాకు మెసేజ్ వస్తే నేను ప్రజలతో పంచుకున్నాను. ఎవరి ఫోన్లు టాప్ అయినయ్. ఎవరు చేశారనేది ప్రభుత్వం తేల్చాలన్నారు. ట్యాపింగ్ పైన అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డగోలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందన్నారు. ప్రతిసారి మొగోడివైతే మొగోడివైతే అని మాట్లాడుతావు కదా… మరి నువ్వు నిజంగానే మగాడివైతే రేవంత్ రెడ్డి రుణమాఫీ చెయ్ అని డిమాండ్ చేశారు కేటీఆర్.

Also Read:KTR:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్

 

- Advertisement -