KTR:కాంగ్రెస్ వైఖరితోనే విద్యార్థులకు అవస్థ

39
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితోనే విద్యార్థులు అవస్థ పాలవుతున్నారని ఆరోపించారు కేటీఆర్. రాష్ట్రంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్నారు.. మొత్తానికి కాంగ్రెసోళ్లు వ‌చ్చారు.. పెద్ద‌మార్పే తెచ్చారు అని ఎద్దేవా చేశారు. హాస్ట‌ళ్లలో నెల‌కొన్న దుస్థితిపై ఎక్స్ వేదిక‌గా స్పందించారు కేటీఆర్.

ప‌దేండ్ల క్రితం నాటి కాంగ్రెస్ పాల‌న‌లో ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లో పురుగుల అన్నం, నీళ్ల చారు క‌నిపించేవి. నేటి కాంగ్రెస్ పాల‌న‌లో ప్ర‌భుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. అల్పాహారంలో బ‌ల్లులు, చ‌ట్నీల్లో చిట్టెలుక‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.

- Advertisement -