మెట్రో రైళ్ల ఫ్రీక్వేన్సీని పెంచేందుకు ప్రయత్నించాలని అధికారులను అదేశించారు మంత్రి కేటీఆర్. బేగంపేట మెట్రో రైల్ భవన్‌లో రివ్యూ నిర్వహించిన కేటీఆర్ మెట్రోలో మిగినలిన కారిడార్ల నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని, అయా కారిడార్ల పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటి వరకు పనులు వేగంగా నడుస్తున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. మెట్రో రెండో దశ ప్రణాళికలపైన ఈ సందర్భంగా మంత్రి చర్చించారు. కారిడార్ల ఎంపిక, స్టేషన్ల గుర్తింపు, నిధుల సేకరణ వంటి అంశాలపైన ఒక నివేదిక సిద్దం చేయాలని, త్వరలోనే ముఖ్యమంత్రి ఈ అంశంపైన సమీక్షించే అవకాశం ఉన్నదని అధికారులకు తెలిపారు. ఏయిర్ పొర్ట్ ఏక్స్ మెట్రో ( మెట్రోరైలు) ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్ పొర్ట్ కు కనెక్టీవిటి ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలని మెట్రో అధికారులను కోరారు.
త్వరలోనే ఫ్రీక్వెన్సీతోపాటు రైళ్ల వేగం పెంచడంతో ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని మెట్రోరైల్ యండి ఎన్వీయస్ రెడ్డి మంత్రికి తెలిపారు. ఇతర మెట్రోలతో పొల్చితే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణీకుల సంఖ్య బాగుందన్నారు. చెన్నయ్ లాంటి నగరాల్లో రెండు సంవత్సరాల్లో ప్రయాణీస్తున్న సంఖ్యతో పొల్చితే నగర మెట్రోలో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగానే ఉందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రారంభం నాటి నుంచి ఇప్పటిదాకా ఏలాంటి సమస్యలు లేకుండా మెట్రో కార్యకలాపాలు నడుస్తున్నాయన్నారు. మెట్రో టికెటింగ్ లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి అదేశించారు.
మెట్రో కారిడార్లో పార్కింగ్, ఫుట్ పాత్, రోడ్ల వంటి మౌళిక వసతుల కల్పన మరింత వేగంగా జరగాలన్నారు. పార్కింగ్ సదుపాయాన్ని మరింత పెంచడం కోసం 12 మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలకు టెండర్లు పిలవనున్నట్లు మంత్రికి మెట్రో అధికారులు తెలిపారు. నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద ఈ యంఎల్ పి సదుపాయానికి వారం పది రోజుల్లో టెండర్లు పూర్తి కానున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాల కల్పన కోసం అంతర్జాతీయ స్ధాయి ప్రమాణాలను పాటించనున్నట్లు తెలిపారు. ఉప్పల్ స్టేడియం నుంచి మెట్రో స్టేషన్ వరకు స్కైవాక్ నిర్మాణానికి స్టేడియం అథారిటీల నుంచి ఆసక్తి వ్యక్తం అయిందన్నారు. మెట్రో స్టేషన్లతోపాటు, అయా కారిడార్లతో మూత్రశాలలు అవసరం ఉందని, వాటి నిర్మాణం కోసం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా షి టాయ్ లెట్ల నిర్మాణం చేయాలని మంత్రి అదేశించారు. ఈ సమావేశంలో పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్ తోపాటు, మెట్రో రైల్ యండి ఏన్వీయస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.