కువైట్ లో చిక్కుకున్న మనోహర్ కు కేటీఆర్‌ సహకారం…..

96
KTR

పొట్ట కూటికోసం కువైట్ లో కూలీ పని చేసుకుంటున్న తెలంగాణ వాసికి ఎదురైన కష్టాలకు మంత్రి కెటీఆర్‌ చొరవతో స్వాంతన లభించింది. మంత్రి కువైట్ లో చిక్కుకున్న సిరిసిల్లా జిల్లవాసి చిప్ప మనోహర్ కు ఏన్నారై శాఖ మంత్రి చేయూత అందించారు. అక్కడిసిల్లా జిల్లా కోనరావు పేట్ మండలం, నిమ్మపల్లి కి చెందిన మనోహర్ కూలీ పని కోసం కువైట్ వెళ్లారు.

అయితే వెళ్లిన మనోహర్ కు కాన్సర్ వ్యాది సోకినట్లు నిర్దరణ అయ్యింది. దీంతో కువైట్లోని షెక్ బద్రియా అసుపత్రిలో చేరడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మనోహర్ కుటుంబం ప్రభుత్వ సహయం కోరింది. అక్కడ అసుపత్రిలో మనోహర్, ఇక్కడ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు, ఈ విషయం తనకు తెలసిన వేంటనే మంత్రి వేగంగా స్పందించారు. మంత్రి తెలంగాణ ఏన్నారై శాఖ అధికారులతో మాట్లడిన మంత్రి, భాదితున్ని వేంటనే తెలంగాణకు రప్పించాలని, ఈమేరకు విదేశి వ్యవహాల శాఖ అధికారులతో మాట్లాడాలని అదేశించారు.

కువైట్ లో మనోహర్ మీద ఒక కేసు పెండింగ్ ఉండటం, 19 లక్షల పరిహారం చెల్లిస్తేనే స్వదేశం పంపిస్తామని అక్కడి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి చోరవతో అక్కడి ఏన్జీవోల సహకారంతో కువైట్ అధికారులు కేసు నుంచి విముక్తి కల్పించారు. తెలంగాణ ఏన్నారై శాఖ అధికారుల ప్రత్యేక కృషితో మనోహర్ రేపు హైదరాబాద్ కు తీసుకుని రానున్నారు. కాన్సర్ చికిత్స కోసం నిమ్స్ లో అన్ని ఎర్పాట్లు చేయలాని అధికారులకు మంత్రి అదేశించారు. రేపు హైదరాబాద్ రాగానే మనోహర్ నిమ్స్ లో చికిత్స అందించనున్నారు. మనోహర్ హస్పిటల్ తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రవాస భారతీయులకు ఎలాంటి కష్టం ఉన్నా తెలంగాణ ఏన్నారై శాఖ 040-23220603, లేదా [email protected] ఈ మెయిల్ చేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.