ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోంది…ఇది ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు. రాయలసీమలో జన సంవాద్ వర్చువల్ ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి…జగన్‌ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
పార్టీలు మారిన,సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేసిన పోలీసులు కేసులు పెడుతూ వేధిస్తున్నారన్న ఫిర్యాదుల తనకు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ పాలనంత అవినీతి వికేంద్రీకృతమైందని…చంద్రబాబు హయాంలో అవినీతి, అసత్యాల పాలన జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి పదవులను దక్కించుకున్నా రాయలసీమ అభివృద్ధి చెందలేదని.. మాజీ సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి ప్రాజెక్టులు, నిధులు తీసుకుని రాష్ట్రాభివృద్ధికి ఏమీ చేయలేదన్నారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియాలు చెలరేగుతున్నాయని పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు.