వైరల్‌గా కృతి శెట్టి ‘ఉప్పెన’ లుక్

351
kruthi

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘ఉప్పెన‌’. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా కు డైరెక్ట‌ర్‌గా ఇదే తొలి చిత్రం. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సోమ‌వారం హీరోయిన్ కృతి శెట్టి బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా చిత్రం బృందం ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. “క్యూటెస్ట్ అండ్ నేచుర‌ల్ యాక్ట్రెస్ కృతి శెట్టికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు” అంటూ నిర్మాణ సంస్థ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. దాంతో పాటు షేర్ చేసిన పోస్ట‌ర్‌లో చేతులకు గాజులు వేసుకుంటూ అపురూపంగా వాటిని చూసుకుంటోన్న కృతి శెట్టి స్టిల్ అమితంగా ఆక‌ట్టుకుంటోంది.

ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన విడుద‌ల చేసిన పాట‌ల్లో, స్టిల్స్‌లో కృతి అంద‌చందాలు, ఆమె క‌నిపించిన తీరు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. వైష్ణ‌వ్‌తేజ్‌,కృతి మ‌ధ్య కెమిస్ట్రీ ముచ్చ‌ట‌గా అనిపిస్తోంది.రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చిన పాట‌లు సంగీత‌ప్రియుల‌ను అల‌రిస్తూ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి. ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు ఉప్పెన‌కు క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను బుచ్చిబాబు అందించారు.

త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర చేస్తున్న ‘ఉప్పెన’ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డి, థియేట‌ర్లు తెరుచుకోగానే చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్న‌ద్ధంగా ఉన్నారు.

తారాగ‌ణం:
పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ

సాంకేతిక బృందం:
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: మౌనికా రామ‌కృష్ణ‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, మ‌ధు మ‌డూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై, అశోక్ బి.
సీఈవో: చెర్రీ
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా
బ్యాన‌ర్స్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌