ప్రభాస్‌ ‘ఆదిపురుష్’లో కృతి సనన్..

303
Prabhas
- Advertisement -

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా షూటింగులో హీరోయిన్ కృతి సనన్, నటుడు సన్నీ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ మేరకు ప్రభాస్ సోషల్ మీడియాలో వెల్లడించారు.

ఆదిపురుష్ కుటుంబంలోకి కృతి సనన్, సన్నీ సింగ్ లకు స్వాగతం అంటూ స్పందించారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తుండగా. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నట్టు సమాచారం. అయితే కృతి సనన్ ను తీసుకుంటే ప్రభాస్ సరసన సీత పాత్రకేనా అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -