సౌత్‌లో ఎక్కువగా హోమ్లీ క్యారెక్టర్‌లే చేసిన కృతి కర్బందా, బాలీవుడ్‌లో మాత్రం రెచ్చిపోయి హాట్ సీన్లు చేస్తోంది. అంతే కాదు తన ఫస్ట్ కిస్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా అభిమానులతో షేర్ చేసుకునే రేంజ్‌కు ఎదిగిందీ భామ. సుమంత్ సరసన బోణీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరో సరసన నటించినప్పటికీ కృతికి అంతగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్‌కు షిఫ్ట్ అయినప్పటికీ మైలేజ్ ఏ మాత్రం పెరగలేదు. అనుకోకుండా బాలీవుడ్‌లో ఇమ్రాన్ హష్మీ సరసన ‘రాజ్ రిబూట్’లో అవకాశం దక్కించుకొని అందరికీ షాకిచ్చిందీ ముద్దుగుమ్మ. రాజ్ సిరీస్‌లో నాల్గవ భాగంగా వస్తోన్న ఈ సినిమాలో సీరియల్ కిస్సర్ ఇమ్రాన్‌తో హాట్ హాట్ సీన్లు చేసింది కృతి.
ఇమ్రాన్‌తో సినిమా అనగానే మొదట్లో ఈ బ్యూటీ చాలా భయపడిందట. అయితే స్వయంగా ఇమ్రానే కృతీకి ముద్దు సీన్లలో నటించడం ఎలాగో ట్రైనింగ్ ఇచ్చాడట. అంతేగాదు సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ముద్దు సీన్లలో నటించడం ఎలానో ప్రాక్టీస్ కూడా చేశారట. ఇమ్రాన్ సలహాలతో రొమాన్స్ సీన్లలో ఒక రేంజ్‌లో రెచ్చిపోయిందట ఈ భామ.
ఆ సమయంలో ఎమోషన్స్ ఏవీ పనిచెయ్యకూడదనీ, తెరపై కన్పించేదంతా నటన మాత్రమేనని చెబుతోంది కృతి కర్బందా. ఏ స్థాయిలో ఎక్స్‌పోజింగ్ చెయ్యాలనేది దర్శకుడి ఆలోచనల్ని బట్టి వుంటుంది. దర్శకుడు సీన్ వివరించాక, అందులో చెయ్యాలా? వద్దా? అన్నదానిపై నిర్ణయం పూర్తిగా హీరోయిన్లదే అని చెప్పింది కృతి.
చాలా సందర్భాల్లో మా అభిప్రాయాల్ని దర్శకులు గౌరవిస్తారు గనుక, పెద్దగా సమస్యలుండవు.. స్విమ్మింగ్ పూల్‌లో సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు, బికినీ తప్పనిసరి.. రొమాంటిక్ సీన్స్‌లోని గాఢత గురించి ఏ దర్శకుడైనా ముందుగానే చెబుతాడనీ, సీన్ చిత్రీకరణ జరుగుతున్న ఆ క్షణంలో వ్యక్తిగతంగా ఎలాంటి ఎమోషన్స్ ఫీలయ్యే ఛాన్సే వుండదనీ, సీన్ అయ్యాక జరిగిందంతా మర్చిపోవడమేననీ, సీన్ చిత్రీకరణకు ముందు చాలా టెన్షన్ పడాల్సి వుంటుందని కృతి కర్బందా చెప్పుకొచ్చింది.
తామేం చేసినా నటనలో భాగంగానే చేస్తామని … సీన్ డిమాండ్ మేరకు, స్క్రిప్ట్ ప్రకారం నటించడానికైనా సిద్ధమని చెబుతోంది. ఆ సినిమాలో హాట్ గా కనిపించారు కదా.. చుంబనాలతో వేడెక్కించారు కదా.. అంటే, తనలో మాత్రం అలాంటి ఫీలింగ్సేమీ కలగలేదని చెప్పుకొచ్చింది.