విడాకుల రూమర్స్..స్పందించిన కృష్ణవంశీ!

64
krishnavamshi
- Advertisement -

దర్శకుడు కృష్ణవంశీ – రమ్యకృష్ణ విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రూమర్స్‌పై రంగమార్తాండ ప్రమోషన్స్ లో భాగంగా స్పందించారు కృష్ణవంశీ.

బాధ్యతలు వస్తాయని ఆ భయంతో అసలు పెళ్లే వద్దునుకున్నాను. కానీ రమ్యకృష్ణతో ప్రేమలో పడి పెళ్లి జరిగిపోయింది. ఇదంతా లైఫ్‌ డిజైన్‌ అని అనుకుంటాను. పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులు ఏం రాలేదు. రమ్యకృష్ణ నన్ను నన్నులాగానే ఉండనిచ్చింది. రమ్యకృష్ణతో విడాకులు అనేది అబద్దం. అందులో అసలు నిజం లేదు..ఇలాంటి రూమర్స్‌ని తాము పట్టించుకోమన్నారు.

నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంతఃపురం, మురారి, ఖడ్గం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలని అందించారు. ఆయన తీసిన సినిమాలకి జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.

- Advertisement -