ఆకట్టుకుంటున్న ‘కృష్ణ వ్రిందా విహారి’…టీజర్

95
shourya
- Advertisement -

నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం కృష్ణ వ్రింద విహారి. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షెర్లిన్ సితియా కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 22న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ని రిలీజ్‌ చేశారు.

టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశారు. కనిపించి వినిపించకుండా.. వినిపించి కనిపించకుండా.. గంట ఇక్కడి నుంచి వస్తోంది. మీకూ వినిపిస్తోందా? అని నాగశౌర్య ఒక అమ్మాయిని ఉద్దేశిస్తూ అనడం.. గంట చప్పుడైందే.. దగ్గరలో గుడికూడా లేదు. అంటూ నాగశౌర్య ని అతడి ఫ్రెండ్స్ సత్య, రాహుల్ రామ్ కృష్ణ ఆటపట్టించడం ఆసక్తికరంగా ఉంది. పెళ్ళి చేసుకుందాం సినిమాలో సౌందర్యలా సెక్యువల్ అబ్యూజ్ అయినా పర్వాలేదు. వెంకటేశ్ కన్నా నిన్ను బాగా చూసుకుంటాను అని హీరో చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది.

- Advertisement -