వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోండగా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రంతో నాగశౌర్య ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం..
కథ:
అమృతవల్లి (రాధిక శరత్ కుమార్) ఊర్లో ఆమె చెప్పిందే శాసనం. ఆమె ధాటికి భయపడి ఊర్లోని అమ్మాయిలంతా కృష్ణ (నాగ శౌర్య)ను అన్నయ్య అని పిలుస్తుంటారు. కృష్ణను ఎంతో పద్దతిగా పెంచుతుంది. అయితే ఉద్యోగం కోసం సిటీకి వచ్చిన కృష్ణ.. వ్రింద (షెర్లీ సెటియా)ను చూసి ఇష్టపడతాడు. అయితే వ్రిందకు పిల్లలు పుట్టరనే సమస్య ఉండగా పెళ్లి చేసుకునేందుకే ఫిక్స్ అవుతాడు. కానీ అమృతవల్లి మాత్రం చనిపోయిన తన తల్లి కృష్ణ కడుపులో పుడుతుందని ఆశపడుతుంది. సీన్ కట్ చేస్తే తర్వాత ఏం జరుగుగుంది…? వ్రిందను పెళ్లి చేసుకునేందుకు కృష్ణ పడ్డ పాట్లు ఏంటి? చివరకు కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ రన్ టైం, సెకండాఫ్ కామెడీ, విజువల్స్. కృష్ణ పాత్రలో మెప్పించారు నాగ శౌర్య. కామిక్ టైమింగ్, ఎమోషనల్ సన్నివేశాలు ,రొమాంటిక్ ట్రాక్‌లలో నటన సూపర్బ్. ఇక తొలి సినిమానే అయినా శెర్లీ సెటియా తన పాత్రలో ఒదిగిపోయింది. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని మెప్పించింది.
రాధిక శరత్ కుమార్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ,అన్నపూర్ణమ్మ అంత తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథ, కథనం,సెకండాఫ్‌లో వీక్ స్క్రీన్ ప్లే. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి కానీ ఫన్నీ సన్నివేశాల మధ్య వాటిని ఉంచిన విధానం బాలేదు.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా బాగుంది. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. కెమెరాపనితనం బాగుంది. నాగ శౌర్య, షెర్లీని చక్కగా చూపించారు. ఎడిటింగ్, ఆర్ట్, నిర్మాణ విలువలు అన్నీ కూడా చక్కగా కుదిరాయి.
తీర్పు:
కథ కొత్తదేమీ కాదు. ఇలాంటి పాయింట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అలాంటి కథతో వచ్చినా కామెడీతో సినిమాను ముందుకు నడిపించారు. భార్యాభర్తలు, అత్తా కోడలు, భార్యకు తల్లికి మధ్యలో నలిగే కొడుకు మెప్పించింది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో చూడదగ్గ చిత్రం కృష్ణ వ్రింద విహారి.
విడుదల తేదీ:23/09/2022
రేటింగ్:2.5/5
నటులు:నాగ శౌర్య, శెర్లి సెటియా
సంగీతం: మహతి సాగర్
నిర్మాత: ఉషా మల్పూరి
దర్శకుడు: అనీష్ ఆర్ కృష్ణ