రంగమార్తాండ అప్‌డేట్ ఇచ్చిన కృష్ణవంశీ..

42
prakash raj

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం రంగమార్తాండ. మరాఠీలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘నటసమ్రాట్’ చిత్రానికి ఇది రీమేక్ కాగా ఎప్పుడో పూర్తి కావాలిన ఈ సినిమా కరోనా వేవ్స్ కారణంగా చిత్రీకరణ ఆలస్యంగా జరుగుతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు కృష్ణవంశీ. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని ఇందుకు సంబంధించిన మేకింగ్ పిక్‌ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు కృష్ణవంశీ. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, శివాత్మిక, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.