కర్నూల్‌లో ఎలుగుబంట్లు హల్‌చల్

17
elugu

కర్నూలు జిల్లాలో శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట పరిసరా ప్రాంతాల్లో అర్ధరాత్రి ఎలుగుబంట్లు హల్‌చల్ చేస్తున్నాయి. నివాస గృహాలలోకి ఎలుగుబంట్లు వస్తుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు పూర్ణానంద ఆశ్రమం, బండ్లబజార్ ప్రాంతాలలో మూడు రోజుల నుంచి అర్థరాత్రి ‌సమయంలో ఎలుగుబంట్లు గత మూడు రోజుల నుంచి గ్రామంలోకి వస్తున్నాయి.స్థానికులు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు ఎలుగుబంట్లను అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

టపాసులు కాలుస్తూ ఎలుగుబంట్లను తరుముతున్నప్పటికీ రెండు ఎలుగుబంట్లు తిరిగి జనావాసాలలోకి వస్తున్నాయి.దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఎలుగుబంట్లు ఎటు వైపు నుంచి జనావాసాల్లోకి వచ్చి తమ పై దాడి చేస్తాయోనన్న భయం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.