కృష్ణా నదిలో వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఆల్మట్టి డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతున్నది. 1,29,700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఆల్మట్టి నుండి నారాయణ పుర ప్రాజెక్ట్ కి 40,000 క్యూసెక్కు లు వరద చేరుతుంది. నారాయణ పుర ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 33.31 టీఎంసీ..ప్రస్తుతం 20.72 టీఎంసీలకు చేరింది. నారాయణపుర ప్రాజెక్ట్ నుండి కృష్ణ నదిలోకి రేపటి నుండి 40,000 క్యూసెక్కుల లేదా అంత కంటే ఎక్కువ వరద నీరు వదిలే అవకాశం ఉంది.
డ్యామ్ దిగువ ప్రాంత ప్రజలు…కృష్ణ నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణ పుర ప్రాజెక్ట్ అధికారులు సూచించారు. ఏ క్షణమైనా వరద వచ్చే అవకాశం ఉన్నందున నదిలోకి ఎవరు వెళ్ళొద్దని హెచ్చరించారు. నారాయణ పుర ప్రాజెక్ట్ నుండి వరద వస్తే ఈ సీజన్ లో జూరాల ప్రాజెక్ట్ గేట్లు మొదటిసారి తెరచుకొనున్నాయి. జూరాల ఎగువన ప్రాజెక్ట్ గేట్ల మరమ్మత్తుల కారణంగా వదిలిన నీటితో ఇప్పటికే దాదాపుగా జూరాల నిండిపోయింది.