సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం..

50

తెలంగాణ అసెంబ్లీలోని వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. వర్చువల్ మీటింగ్‌లో ప్రొటెం చైర్మన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. కరోన వైరస్ విజృంభిస్తున్న ఈ కష్ట కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు నిర్వహించామన్నారు. కరోన సెకండ్ వేవ్ నుండి ప్రజలను సురక్షితంగా కాపాడాలని లాక్ డౌన్ నిర్వహించడం జరిగింది. కరోన పాజిటివ్ కేసులు భారీగా తగ్గిన తరుణంలో కొద్దిరోజుల క్రితమే లాక్ డౌన్ తొలగించడం జరిగిందని భూపాల్‌ రెడ్డి వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతోంది.ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్టాన్ని చిన్నచూపు చూడకుండా అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి కార్యదర్శి డా” నరసింహచార్యులు కూడా పాల్గొన్నారు.