హ్యాపీ బర్త్ డే..కృష్ణ పూనియా

45
- Advertisement -

సాధారణంగా పెళ్లి తర్వాత ఆడవారు తాము ఎంచుకున్న రంగాల్లో రాణించడం సవాల్‌తో కూడిన సమస్య. కుటుంబం, సమాజం నుండి మద్దతు రావడం అలాగే కెరీర్‌,ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం చాలా కాష్టం. కానీ అలాంటి కష్టాన్ని ఎదురించి తాను ఎంచుకున్న క్రీడా రంగం తర్వాత రాజకీయ రంగంలో రాణిస్తూ ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారు కృష్ణ పూనియా.

హర్యానాలో పుట్టి పెరిగింది కృష్ణ. చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో నానమ్మ పెంచి పెద్దచేశారు. తల్లి లేని కుటుంబం కావడంతో ఆమెకు చిన్నప్పుడే అంటే పదిహేనేళ్లకే పెళ్లిచేశారు. ఆమె భర్త వీరేందర్ రైల్వే ఉద్యోగి.

Also Read:బుద్ధుడు చూపిన మార్గం… నేటికి స్పూర్తిదాయకం

2000లో పెళ్లయింది, మరుసటి ఏడాది ఓ కొడుకు పుట్టాడు. వీరేందర్‌ డిస్కస్‌ థ్రో క్రీడాకారుడు. అతడు సరదాగా భార్యకు డిస్కస్‌ థ్రో నేర్పించాడు. పెళ్లి తర్వాత ఆమె గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కూడా చేశారు. ఆ తర్వాత రైల్వేలో ఉద్యోగంలో చేరింది. అయితే సరదాగా నేర్చుకున్న డిస్కస్‌ థ్రోని వదల్లేదు. 2010 లో ఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో డిస్కస్‌ థ్రో ఈవెంట్‌లో బంగారు పతకాన్ని, దోహాలో కాంస్యాన్ని సాధించారు.

2006 ఏషియన్‌ గేమ్స్‌లో కాంస్యం గెలచుకుంది. మూడుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారిణి. అర్జున, పద్మశ్రీ అవార్డుల గ్రహీత. మనదేశం నుంచి కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి మహిళ కృష్ణ పూనియా. ఆమె వ్యక్తిగత రికార్డు 64.76 మీటర్లు. ఉమెన్స్‌ డిస్కస్‌ త్రో విభాగంలో ఆమెది నేషనల్‌ రికార్డు.

Also Read:హ్యాపీ బర్త్ డే..రాయ్ లక్ష్మీ

తొలిసారి చురు జిల్లాలోని సదుల్‌పూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. కానీ అప్పుడామె గెలవలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే సదుల్‌పూర్‌ నుంచి 18 వేల భారీ మెజారిటీతో గెలిచారామె. ఇప్పుడు కృష్ణ పూనియా సదుల్‌పూర్‌ ఎమ్మెల్యే.

- Advertisement -