హ్యాపీ బర్త్ డే..రాయ్ లక్ష్మీ

49
- Advertisement -

కాంచనమాల కేబుల్ టీవీతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన బ్యూటీ లక్ష్మి రాయ్.తెలుగుతో పాటు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించిన అదృష్టం మాత్రం వరించలేదు. దీంతో అందరు హీరోయిన్ల బాటలోనే తన గ్లామర్‌,క్లీవేజ్‌ షోలకు మరింత పదునుపెట్టింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులో హీట్ పెంచేస్తోంది. ఇవాళ ఈ అందాల భామ పుట్టినరోజు.

1989 మే 5న కర్ణాటకలోని బెలగమ్‌లో జన్మించారు. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్. పూరు కాఫీ, శరవణ స్టోర్స్, ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనల్లో నటించింది. లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచనలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. పవన్‌తో సర్దార్ గబ్బర్ సింగ్‌, చిరు నటించిన ఖైదీ నెంబర్ 150లో రత్తాలుగా అలరించింది.

Also Read:నటుడిగా పేరుతెచ్చుకోవాలని ఉంది:నరేశ్‌

అకీరాతో బాలీవుడ్‌లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.మోస్ట్ పాపులర్ నటిగా, బెస్ట్ సపోర్టింగ్ నటిగా మలయాళ,తమిళ్‌, స్టైలీష్ స్టార్ ఆఫ్ సౌత్ సినిమా అవార్డులను గెలుచుకున్నారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో జాతక రీత్యా తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. ఈ పేరుతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది.

తమిళంలో గతేడాది అరుల్ శరవణన్ హీరోగా నటించిన ది లెజెండ్ మూవీలో ప్రత్యేక గీతంలో మెరిసింది. ప్రస్తుతం ఈమె నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

Also Read:సంగీత ప్రపంచంలో కిషన్‌ మహారాజ్ దృవతార..

- Advertisement -