మల్టీస్టారర్‌ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్..

199
Krishna superstar
- Advertisement -

వెండితెరపై ప్రయోగాత్మక చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ సూపర్ స్టార్ కృష్ణ. నటుడిగా, నిర్మాతగా,దర్శకుడిగా వెండితరపై అన్ని క్రాఫ్ట్‌లపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి కృష్ణ. అందుకే వెండితెరపై విభిన్న కథా చిత్రాలను అందించారు. ముఖ్యంగా మల్టీస్టారర్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచారు.

తొలి మల్టీస్టారర్ కాంతారావుతో కలిసి ఇద్దరు మొనగాళ్లులో నటించారు. తర్వాత కృష్ణంరాజు, ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో కలిసి అనేక మల్టీస్టారర్‌ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా కృష్ణంరాజుతో కలిసి ఏకంగా సినిమాల్లో నటించారు.

అక్కినేనితో కలిసి మంచి కుటుంబం, అక్కా చెల్లెలు,హేమాహేమీలు, గురుశిష్యులు, ఊరంతా సంక్రాంతి, రాజకీయ చదరంగం సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్‌తో కలిసి నిలువుదోపిడి, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు, వగలమారి భర్తలు వంటి సినిమాల్లో నటించారు. శోభన్ బాబుతో 13, మోహన్ బాబుతో 4, శివాజీ గణేశన్తో 3, రజినీకాంత్ తో 3, సుమన్తో 3, నాగార్జున తో 2, చిరంజీవి, బాలకృష్ణ, హరికృష్ణ, రవితేజలతో ఒక్కో సినిమాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -