టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కిస్తూ…ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆయన సినిమాలు మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉంటాయని, సినిమాని తెరకెక్కించే తీరు కూడా ఆకట్టుకుంటుందని అందరి అభిప్రాయం. అయితే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో సత్తా ఉన్న డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు క్రిష్.
అంతేకాకుండా పరిమిత బడ్జెట్‌తో టెక్నికల్‌గా హై స్టాండార్డ్ ఉన్న సినిమా తీశాడని పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు అదే టెక్నిక్ అతడికి బాలీవుడ్లో కూడా వర్కవుటవుతోందని సమాచారం. కంగన టైటిల్ పాత్రలో ‘ఝాన్సీ లక్ష్మీభాయ్’ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించనున్నాడని టాక్. ఇప్పటికే క్రిష్ పేరును కంగన పరిశీలిస్తోందట.
కంగన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు, తనే స్వయంగా సొంత బ్యానర్‌లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. నిజానికి క్రిష్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించే 75వ సినిమాని తెరకెక్కించాల్సి ఉంది. కానీ అది ఎందుకనో చివరి నిమిషంలో డ్రాపైంది. ఆ తర్వాత బాలీవుడ్ ప్రయత్నాలు ప్రారంభించాడు క్రిష్.
అక్కడ అక్షయ్‌తో ‘గబ్బర్’ వంటి బ్లాక్‌బస్టర్ తెరకెక్కించాడు కాబట్టి కంగన సైతం క్రిష్ ప్రతిభను నమ్మి అవకాశం ఇస్తోందిట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే ఛాన్సుంది. ఇక ఈ ప్లాన్ వర్కౌట్ అయితే..క్రిష్ కూడా టాప్ డైరెక్టర్‌గా ఆయన పేరు మరింత మారిమోగిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.