మరోసారి ‘వీరమల్లు’ క్లారిటీ!

1238
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ అంటూ గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ అవ్వడం కష్టమే అనే టాక్ వినిపించింది. అలా చక్కర్లు కొడుతున్న రిలీజ్ డేట్ పై తాజాగా మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ఇటివలే బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ఈ సినిమా షూట్ లో పాల్గొన్నాడు. సినిమాలో ఔరంగజేబుగా కనిపించనున్న బాబీ డియోల్ కి వెల్కం చెప్తూ మేకర్స్ ఓ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో ఎండింగ్ లో సమ్మర్ రిలీజ్ అంటూ మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. కాకపోతే రిలీజ్ డేట్ చెప్పలేదు. ఏప్రిల్ లేదా మే లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఏ ఎం రత్నం సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎ.దయాకర్ రావు నిర్మాత. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

సుక్కు , విజయ్ దేవరకొండ లేనట్టే?

అయ్యో.. సూపర్ స్టార్ కి షోల్డర్ సమస్య

ప్రభాస్ డబుల్ రోల్ ?

- Advertisement -