గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌కి ఓ చారిత్రాత్మక చిత్రాన్ని అందించిన డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం మరోసారి మరో చారిత్రాత్మక చిత్రంతో బాలీవుడ్ ఆడియెన్స్‌ని కూడా ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. క్వీన్ ఆఫ్ బాలీవుడ్‌గా పేరున్న కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రాణి ఝాన్సీ లక్ష్మీ బాయి రియల్ స్టోరీతో సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు క్రిష్.
ఝాన్సీ రాణి అయిన రాణీ ఝాన్సీ లక్ష్మీ బాయ్ యధార్థగాధ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి మణికర్ణిక అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాణి ఝాన్సీ లక్ష్మీ బాయి అవతారంలో కంగనా రనౌత్ ఎలా వుంటుందో తెలిపే స్కెచెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ చారిత్రాత్మక చిత్రానికి రచయిత కే విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు. బజ్రంగీ భాయిజాన్, బాహుబలి వంటి చిత్రాలకి కథను అందించిన రచయితగా కే విజయేంద్ర ప్రసాద్‌కి కూడా బాలీవుడ్‌లో మంచి పేరుంది.
చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఇవాళ కాశీలో ఎనౌన్స్ చేయనున్నారు. సాయంత్రం దశాశ్వమేథ్ ఘాట్ లో జరగనున్న గంగ హారతిలో యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు. తరువాత ప్రెస్ మీట్ లో సినిమా ఎనౌన్స్‌మెంట్ తో పాటు లక్ష్మీభాయ్ లుక్ లో కంగనా 20 అడుగుల పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.
బాలీవుడ్ నిర్మాత కమల్ జైన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా.. సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ ను సంగీతం అందిస్తున్నారు. ప్రసూన్ జోషి మాటలు పాటలు రాస్తున్నారు. మరాఠ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాణీ లక్ష్మీభాయ్ 1828లో కాశీలోనే జన్మించింది.