హ్యాపీ బర్త్‌ డే త్రిష..

215
Trish's Birthday

నీ మనసు నాకు తెలుసు..సిని ప్రస్తానాన్ని ప్రారంభించి.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా..అంటూ తెలుగింటి ఆడపిల్లలా కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన నటి త్రిష. సినీ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు చాలా తక్కువగా మందే ఉన్నారు. అయితే అందాల భామ త్రిష హీరోలతో సమానంగా క్రేజ్ ని సొంతం చేసుకుంది.

అంతేకాకుండా ఈ మధ్య పరిశ్రమలో అత్యధిక కాలం హీరోయిన్ గా రాణిస్తున్న ఘనత కూడా త్రిష సొంతమేనని చెప్పాలి. ఇదిలా ఉంటే.. నేడు త్రిష తన పుట్టినరోజు. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలనుంచి బర్త్‌ డే విషెస్‌ అందుకుంది త్రిష.
 Trish's Birthday
తమిళ , తెలుగు చిత్ర పరిశ్రమలలో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష 1983 లో మే 4 న చెన్నైలో జన్మించింది. 1999 లో మిస్ మద్రాస్ గా ఎన్నికైన ఈమె 2001 లో మిస్ ఇండియా పోటీల్లో ‘బ్యూటిఫుల్ స్మైల్’ అవార్డ్ సొంతం చేసుకున్నది. 1999న విడుదలయిన ‘జోడి’ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన త్రిష తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో ఇక్కడి వారికీ పరిచయమయ్యింది.

Trish's Birthday

తెలుగులో ‘వర్షం’ , ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ , ‘అతడు’ , ‘పౌర్ణమి’ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది త్రిష. తెలుగులోనే కాక త్రిష తమిళంలోనూ అగ్ర హీరోయిన్ గా రాణించింది. అంతే కాక హిందీలో కూడా కొన్ని సినిమాల్లో నటించి తెగ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ని పెంచేసుకుంటుంది త్రిష. ఇక నేడు (గురువారం) త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది www.greattelangana.com