కొవ్వూరు…టీటీడీ చతుర్వేద హవనం

21
- Advertisement -

లోక సంక్షేమం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొవ్వూరులో చతుర్వేద హవనం ప్రారంభించనున్నట్టు ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు. శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ, ధార్మిక ప్రాజెక్టుల సంయుక్త ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని… ఆంధ్ర గీర్వాణ కళాశాల ప్రాంగణంలో మంగళవారం నుంచి శ్రీనివాస రుక్‌ సంహితచతుర్వేద హవనం ప్రారంభమైనట్టు తెలిపారు. మార్చి ఆరో తేదీ వరకు ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమంలో జరగనున్నట్టు వెల్లడించింది.

ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి ఆకెళ్ల విభీషణ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా రుగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యుజుర్వేదం, సామవేదం, అధర్వణ వేద పారాయణాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఏడు రోజులు పాటు సాయంత్రం టీటీడీ అన్నమాచార్య కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను వినిపించనున్నారు. చివరి రోజు అయిన మార్చి ఆరో తేదీ నాడు కంచి కామకోటి పీఠం పీఠాధిపతిశ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమంతో చతుర్వేద హవనం పూర్తి అవుతున్నట్టు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి…

ఆగస్టు 29,30న గ్రూప్‌-2 పరీక్ష…

నా జీవితంలో పెట్లబుర్జుకు ప్రత్యేక స్థానం:సంతోష్‌

గిఫ్ట్ ఏ స్మైల్‌..విద్యార్థులకు దిశానిర్దేశం

- Advertisement -