కొత్త ఇల్లు కొన్న చైతు

24
- Advertisement -

నాగ చైతన్య ఇటీవల జూబ్లీహిల్స్‌లో కొత్త బంగ్లాను కొనుగోలు చేశాడు. చై ఇప్పుడు తన కొత్త ఇంట్లోకి మారినట్లు సమాచారం.చై తన కొత్త ఇంటికి మారుతున్నట్లు తెలిసిన వర్గాలు చెప్తున్నారు.

చైతన్య , సమంత గతంలో మురళీ మోహన్ నుండి గచ్చిబౌలిలో ఒక పెంట్ హౌస్ బేస్ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశారు. విభేదాలు వచ్చే వరకు దంపతులు అందులోనే కలిసి ఉండే వారు.

ఈ జంట విడాకులు తీసుకున్న తరువాత, చైతన్య ఇంటి నుండి బయటకు వెళ్లి స్టార్ హోటల్‌లో నివసించడం ప్రారంభించాడు. కాగా, సమంతా ఈ ఇంటిలోనే కొనసాగుతోంది. ఆమె తన పని ఆధారంగా బొంబాయి మరియు హైదరాబాద్ మధ్య ట్రావెల్ చేస్తుంది.

ఇంతలో, చై జూబ్లీహిల్స్‌లో ఈ కొత్త ఆస్తిని కొనుగోలు చేశాడు. ఇంటీరియర్ పనులు పూర్తి చేసిన తర్వాత, ఈ ఇంట్లోకి మారాడు. చైతన్య రీసెంట్‌గా లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో సక్సెస్‌ని అందుకున్నాడు. 12 మే, 2023న విడుదల కానున్న తెలుగు-తమిళ ద్విభాషా కస్టడీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ 14 ఏప్రిల్, 2023న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి…

ps-2: కమల్‌హాసన్‌…పీఎస్‌-2ట్రైలర్‌ విడుదల

alluarjun:నేటితో 2దశాబ్దాల సినీ జీవితం..!

memufamous:మేమ్‌ ఫేమస్‌ బ్లాక్ బస్టర్ హిట్‌: మల్లారెడ్డి

- Advertisement -