బాలోత్సవంతో ఎంతోమేలు:కోరుకంటి చందర్

277
korukanti chander

విద్యార్థులుల్లో ఉన్న సృజనాత్మకను వెలికితీసేందుకు బాలోత్సవంను నిర్వహిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ బాలోత్సవ్ 2019, రెండోవ రోజు విజయవంతం గా ముగి సింది, విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొంటున్నారు.

నేటి బాలలే రేపటి పౌరులని,ఇలాంటి బాలోత్సవం ద్వార విద్యార్థులలో ఉన్న ప్రతిభను ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తు లో వారి ఎదుగుదలకు ఏంతగానో ఉపయోగపడుతుందని రామగుండం ఎమ్మెల్యే చందర్ అన్నారు.

ఈ పోటీలలో రామగుండం ప్రాంతానికి చెందిన 105 ప్రభుత్వ,ప్రవేట్ పాఠశాలలకు చెందిన 3500 విద్యార్థులు పాల్గొనటం ఆనందంగా ఉందని చందర్ అన్నారు, ఈ కార్యక్రమంలో జెడ్ పి చైర్మన్ పుట్ట మధు,డి ఈ ఒ పాల్గొన్నారు.